తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Fire Accident In Crackers Shop : బాణాసంచా దుకాణంలో పేలుడు.. 9 మంది మృతి - blast in crackers shop tamilnadu

Fire Accident In Crackers Shop : బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో జరిగిందీ ఘటన.

Fire Accident In Crackers Shop
Fire Accident In Crackers Shop

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 1:46 PM IST

Updated : Oct 9, 2023, 6:59 PM IST

Fire Accident In Crackers Shop : కర్ణాటకలోని బాణాసంచా గోదాంలో జరిగిన ఘోర విషాదం మరువక ముందే మరో ఘటన తమిళనాడులో జరిగింది. బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అరియాలూర్​ జిల్లాలో జరిగిందీ దుర్ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని వీరకలూరు గ్రామంలో రాజేంద్రన్​.. జాఫ్నా క్రాకర్స్​ పేరుతో టపాసులు విక్రయించే దుకాణాన్ని నడుపుతున్నాడు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడం వల్ల శివకాశీకి చెందిన 35 మంది.. టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు వ్యాపించి పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు పేలాయి. మంటలు, పొగ వ్యాపించడం వల్ల స్థానికులు.. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

ఘటనాస్థలిలో ఎగిసిపడుతున్న మంటలు

Tamil Nadu Crackers Shop Fire Accident :సమాచారం అందుకున్న వెంటనే.. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. తీవ్రగాయాలతో గాయపడిన వారు.. తంజావూరు బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్​పీ అబ్దుల్లా ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదస్థలికి ప్రజలు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

తొమ్మిది బైక్​లు దగ్ధం..
ఈ ఘటనపై కీళపాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఒక వ్యాన్, ఒక ట్రాక్టర్​, తొమ్మిది ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయని తెలిపారు. రెండు టపాసుల తయారీ గోదాములు నేలమట్టమైనట్లు చెప్పారు.

చిన్నారి సహా ఏడుగురు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు మరణించారు. టిప్పర్​​-క్రూజర్​ ఢీకొనడం వల్ల ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన విజయనగర జిల్లాలోని హోసపెటే తాలుకాలోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో మరో లారీ సైతం అదుపుతప్పి బోల్తా పడింది. మృతులను హోసపెటేకు చెందిన వారిగా గుర్తించారు. హర్పనపల్లి తాలుకాలోని కూలహళ్లి గోనిబసవేశ్వర ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇంకా కొద్ది సమయం అయితే, వీరంతా.. తమ ఇళ్లకు చేరుకునేవారని పోలీసులు చెప్పారు.

Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

Firecracker Accident : బాణాసంచా గోదాంలో ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య.. రూ.8 లక్షల పరిహారం!

Last Updated : Oct 9, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details