తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

Fire accident in Car Garage: హైదరాబాద్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కారు మెకానిక్‌ షెడ్డులో తెల్లవారజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా.. మూడు కార్లు పూర్తిగా.. నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి.. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Fire accident
Fire accident

By

Published : Mar 25, 2023, 10:48 AM IST

Updated : Mar 25, 2023, 11:06 AM IST

Fire accident in Car Garage: హైదరాబాద్​లో అగ్నిప్రమాదం జరిగింది. కారు మెకానిక్‌ షెడ్డులో మంటలు చెలరేగడంతో ఒకరు సజీవ దహనమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అబిడ్స్‌ బొగ్గులకుంట ప్రాంతంలో వినాయక ఆటో గ్యారేజ్‌ పేరిట బహిరంగ ప్రదేశంలో కారు మెకానిక్‌ షెడ్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో.. షెడ్​లో ఉన్న కార్లకు ఒక్కసారిగా వ్యాపించిన మంటల కారణంగా మూడు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. మరో నాలుగు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి.

అయితే రాత్రి సమయం కావడంతో షెడ్డుకు కాపాలదారుడిగా పని చేస్తున్న కుల్సుంపురాకు చెందిన సంతోశ్​ ఓ కారులో నిద్రించాడు. అతను నిద్రిస్తున్న కారుకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో అతను అందులో నుంచి బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సంతోశ్​ సజీవ దహనమయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు శవపరీక్ష నిమిత్తం సంతోశ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు షెడ్డులో మంటలు ఏ విధంగా చెలరేగాయి, కుట్ర ఏమైనా ఉందా.. లేదా ప్రమాదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మొదటగా పార్కు చేసిన కారులో నుంచి మంటలు చెలరేగాయని అబిడ్స్​ సీఐ ప్రసాద్ తెలిపారు. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోశ్.. అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. కారును ఎవరైనా కావాలని తగులబెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో కారులో మృతి చెందిన వ్యక్తి.. దోమకాటు జెట్ బిల్లలు, సిగరెట్ ముట్టించడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సంతోశ్ మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్లు.. పోస్ట్​మార్టం రిపోర్ట్ ఆధారంగా మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఆసుపత్రికి మంటలు వ్యాపించకుండా.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు.

అగ్నిప్రమాదంలో దగ్ధమైన కార్లు

షార్ట్ సర్క్యూట్ కారణంగా.. ఫుడ్​కోర్టులో అగ్నిప్రమాదం: మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా కామారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.20,00,000 విలువ గల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రమేశ్​ ఫుడ్​కోర్టులో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పని చేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.20,00,000 మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 695 కేసులను అగ్నిమాపకశాఖ అధికారులు నమోదు చేశారు. వీటిలో సుమారు 90 కేసులలో మాత్రమే జరిమానాల రూపంలో శిక్షలు విధించారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఉల్లంఘనలు నిరూపితమైనా నామమాత్రపు జరిమానాలతోనే సరిపెడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ శిక్షల తీవ్రత పెంచాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి:పెళ్లై పిల్లలున్న మహిళతో విద్యార్థి వివాహేతర సంబంధం.. ఆమెను అలా చూడటంతో..!

హత్య కేసులో చిలుక 'సాక్ష్యం'.. నిందితులకు జీవిత ఖైదు

Last Updated : Mar 25, 2023, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details