తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

Fire Accident at Aurora Pharmaceuticals ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Fire Accident at Jeedimetla Aurora Pharmaceuticals Company
ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

By

Published : Mar 1, 2023, 2:16 PM IST

Updated : Mar 1, 2023, 2:48 PM IST

Fire Accident at Jeedimetla Aurora Pharmaceuticals Company ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలం వచ్చేసింది. ఇక ఎండలు మండుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అగ్ని ప్రమాధాలు సంభవించే అవకాశమూ లేకపోలేదు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో దక్కన్ మాల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఇక తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌ శివారులోని జీడిమెట్ల ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ పరిశ్రమలో రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వారు ఈ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులు రవీందర్‌రెడ్డి(25), కుమార్(24)గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక ఎండాకాలం ప్రారంభమైందని... అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతోనైనా పెద్ద ప్రమాదాలు జరగొచ్చని... అలా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా గడ్డివాముకు విద్యుత్‌ వైర్లు కింద, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. లేదంటే తీగలు తగిలి, లేదా ట్రాన్స్‌ఫార్మర్‌లో చిన్న లోపాలు తలెత్తిన ప్రమాదం జరిగిే అవకాశం ఉంది. పొలాల్లో పంటలు చేతికొచ్చిన తర్వాత మిగిలిన చెత్తకు రైతులు మంటలు పెడతారు. ఇలాంటి సందర్భాల్లో.. మంటలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి. వేసవిలో అధికంగా విద్యుత్‌ వినియోగం ఉంటుంది కాబట్టి... ఆ సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ పంపింది. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఎండ తీవ్రతకు సంబంధించిన సర్వైలెన్స్ చేయనున్నట్టు వివరించింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details