Fire Accident at Congress Office: దిల్లీ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ(ఐఏసీసీ) ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 7:30గంటల సమయంలో సమాచారం అందిందని.. వెంటనే ఘటనా స్థలికి రెండు అగ్నిమాపక యంత్రాలను పంపినట్లు చెప్పారు. అయితే మంటలు చిన్నవేనని.. కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి ఏఐసీసీ సిబ్బంది వాటిని ఆర్పివేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ కండీషనర్ కంప్రెషర్‌లో విద్యుత్ లోపం కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. - దిల్లీ న్యూస్
Fire Accident at Congress Office: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం