తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు - Sonia personal secretary rape news

Sonia Gandhi personal secretary rape: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం ఆశజూపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనిపై ఓ మహిళ కేసు పెట్టింది.

Sonia Gandhi personal secretary rape
Sonia Gandhi personal secretary rape

By

Published : Jun 27, 2022, 7:47 PM IST

Sonia personal secretary rape news: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సోనియా పర్సనల్ సెక్రెటరీ పీపీ మాధవన్​పై దిల్లీలోని ఉత్తమ్​నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్​లు పెట్టేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడని చెప్పారు. తన భర్త 2020 ఫిబ్రవరిలో చనిపోయాడని.. తర్వాత తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని వివరించారు.

ఈ నేపథ్యంలోనే సహాయం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లినట్లు బాధితురాలు చెప్పారు. సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిని కలిసినట్లు వివరించారు. 'ఆ తర్వాత మాధవన్ నాతో చాలా సార్లు మాట్లాడాడు. నా ఆర్థిక పరిస్థితి గురించి నేను అతడికి వివరించాను. నాకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నాం. 2022 జనవరి 21న జాబ్ ఇంటర్వ్యూ గురించి నాకు మెసేజ్ పంపించాడు. సురేంద్ర నగర్​లోని ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడు' అని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నారు. అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details