Allahabad High Court on FIR: ఓ కుటుంబ వివాదంపై విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదుపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. ఎఫ్ఐఆర్ అంటే పోర్నోగ్రఫీ కాదని, అందులో జుగుప్సాకరమైన మాటలను పొందుపర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాష వాడటంలో న్యాయవాదుల పాత్ర ముఖ్యమని చెప్పింది. కుటుంబ వివాదాలను పరిష్కారం కోసం కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడికి పంపాలని హైకోర్టు పేర్కొంది.
దాంతో పాటు కూలింగ్ పీరియడ్‌లో (ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 2 నెలల కాలం) అరెస్టు చేయరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పును ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లా, జిల్లా కోర్టులకు పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించింది. మూడు నెలల్లోగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి, పనులు ప్రారంభించాలని జస్టిస్ రాహుల్ చతుర్వేది ఆదేశించారు.