జాతీయ జెండాను అవమానించారంటూ ఓ రైతు కుటుంబంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
ఇదీ జరిగింది
జాతీయ జెండాను అవమానించారంటూ ఓ రైతు కుటుంబంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
ఇదీ జరిగింది
బారీభుజియా గ్రామానికి చెందిన బల్జింద్రా అనే వ్యక్తి.. దిల్లీ- గాజీపుర్ సరిహద్దు వద్ద జరుగుతోన్న ఆందోళనలో పాల్గొనడానికి తోటి స్నేహితులతో కలసి జనవరి 23న వెళ్లాడు. అయితే జనవరి 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా శవాగారంలో భద్రపరిచారు. అయితే ఈ విషయం గురించి అతని కుటుంబ సభ్యలకు ఫిబ్రవరి 2న తెలిసింది. మార్చరీ కొచ్చిన కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని జాతీయ జెండాతో కప్పి అమరవీరుడిలా అంతిమ యాత్రకు తీసుకెళ్లారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల పోలీసులకు తెలిసింది. నిబంధనల ప్రకారం ఒక చనిపోయిన పౌరుడిపై దేశ జెండా కప్పి అంతిమ సంస్కారాలకు తీసుకెళ్లడం నేరమని ఎస్పీ జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. దీంతో బల్జీంద్రా తల్లి జస్విక్ కౌర్, సోదరుడు గురువిందర్తో పాటు మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.
ఇదీ చూడండి:సాగు చట్టాలపై వెనక్కి తగ్గని విపక్షాలు- లోక్సభ వాయిదా