రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్పై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ఘటనపై ఇప్పటికే పలువురి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా తికాయత్ సహా మరికొందరిపై కేసు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
'ఏ రైతు నాయకుడిపై కేసు నమోదైనా.. అది దేశంలోని రైతులపై నమోదైనట్లే' అని ఈ విషయంపై స్పందించారు తికాయత్.