అందాల పోటీ నిర్వహించి.. అందులో గెలిచిన వారికి కెనడాలో స్థిరపడిన అబ్బాయిలతో పెళ్లి చేస్తామని పోస్టర్ వేసిన ఘటన పంజాబ్‌లో కలకలం సృష్టించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడం వల్ల వారిపై కేసు నమోదు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలో అక్టోబర్ 23న అందాల పోటీలను నిర్వహిస్తామంటూ పోస్టర్లు వేశారు నిందితులు.
అందాల పోటీల్లో గెలిస్తే ఎన్ఆర్ఐతో పెళ్లి.. వెరైటీ ఆఫర్ ఇచ్చిన వారు అరెస్ట్
అందాల పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వారికి.. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి చేస్తామంటూ పోస్టర్లు వేశారు కొందరు దుండగులు. పంజాబ్‌లోని బఠిండాలో ఈ ఘటన జరగగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
కెనడా వెళ్లేందుకు అసక్తి ఉన్న యువతులను ట్రాప్ చేయడానికే ఈ అందాల పోటీల ప్రకటనను ఎరగా వేశారని పోలీసులు గుర్తించారు. ఈ అందాల పోటీని ప్రకటిస్తూ బఠిండా అంతటా పోస్టర్లు కనిపించడంపై భాజపా కార్యదర్శి సుఖ్‌పాల్ సింగ్.. బఠిండా ఎస్పీకు లేఖ రాశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని.. ఇలాంటి మోసాలను నిరోధించాలని పంజాబ్ డీజీపీకు మెయిల్ పంపారు సామాజిక కార్యకర్త కుల్దీప్ సింగ్ ఖైరా. పోస్టర్లను పరిశీలించిన పోలీసులు.. నిందితులైన సురెేందర్ సింగ్, రామ్ దయాల్ సింగ్‌పై చీటింగ్ కేసుతో పాటు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.