తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ సరిహద్దుల్లో రహదారులను పునఃప్రారంభించండి' - దిల్లీ సరిహద్దుల్లో రహదారుల మూసివేతపై పిటిషన్​

దిల్లీ సరిహద్దుల్లో రహదారుల పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. నోయిడా-దిల్లీ మధ్య ట్రాఫిక్​ ఇబ్బందులు తలుత్తున్నాయని ఓ వ్యక్తి వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court
సుప్రీంకోర్టు

By

Published : Aug 23, 2021, 5:54 PM IST

Updated : Aug 23, 2021, 8:08 PM IST

రైతుల అందోళలనలో భాగంగా దిల్లీ సరిహద్దుల్లో మూసివేసిన రహదారులను తిరిగి పునఃప్రారంభించేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను మూసివేయడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. సమస్యల పరిష్కారానికై ఆయా ప్రభుత్వాలు చొరవచూపాలని కోరింది.

నోయిడాకు చెందిన మౌనికా అగర్వాల్​ అనే యువతి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రహదారుల దిగ్బంధం కారణంగా తాను 20 నిమిషాలకు బదులు రెండు గంటలు ప్రయాణించాల్సి వచ్చిందని పిటిషన్​లో పేర్కొంది మౌనిక.

"రహదారులను మూసివేయడం అనేది పిటిషనర్‌కు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. ట్రాఫిక్‌ను ఏ విధంగానూ నిలిపివేయకూడదు. ప్రజలకు ఎలాంటి భంగం కలగకూడదు. ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలి. ఇందుకు సెప్టెంబర్ 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం."

- జస్టిస్ ఎస్​కే కౌల్​, జస్టిస్ హృషికేష్​రాయ్‌తో కూడిన ధర్మాసనం

'రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది. అలా అని రోడ్డు మీద ప్రయాణం చేసే వారిని అపడం అనేది సరైన పద్ధతి కాద,'ని వ్యాఖ్యానించారు జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​. ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా ప్రభుత్వాలు ట్రాఫిక్​ నిలిపివేతపై lc వైఖరిని తెలపాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ ర్యాంకు!

Last Updated : Aug 23, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details