రైల్వేలో అప్రెంటిస్‌షిప్ పథకాన్ని(Rail Apprenticeship Scheme) తిరిగి ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) సిఫార్సు చేసింది. రైల్వేలో ప్రతిభావంతులైన యువత అవసరం ఉన్నందున ఈ కోర్సు ప్రారంభం అవసరమని అభిప్రాయపడింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ పథకాన్ని 2015లో నిలిపేసింది కేంద్రం.
పెరుగుతున్న రవాణా రంగ అవసరాల కోసం దీనిని తిరిగి ప్రారంభించాలని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. రైల్వేల హేతుబద్ధీకరణలో భాగంగా రూపొందించిన నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు సిఫార్సు చేసింది. దీనితో పాటు రైల్వే ఆస్తులు, రైల్‌టెల్, క్రిస్(CRIS), ఐఆర్సీటీసీ(IRCTC) వంటి సంస్థల విలీనం సహా అనేక సిఫార్సులను చేసింది.