కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో చేరారని తెలిసింది. ఆమెకు వైరల్ జ్వరం వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు ఆమెలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మంత్రి కోలుకుంటున్నారని స్పష్టం చేశాయి.
ఎయిమ్స్‌లో చేరిన నిర్మలా సీతారామన్.. వైరల్ ఫీవర్ లక్షణాలు! - finance minister admitted in hospital
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కడుపులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్తో ఆమె ఎయిమ్స్‌కు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించాయి.
finance minister nirmala sitharaman
అంతకుముందు.. కడుపులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్తో ఆమె ఎయిమ్స్‌కు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం సాధారణ వైద్య పరీక్షలు సైతం చేశారని పేర్కొన్నాయి. నిర్మలా సీతారామన్ ఏటా రెండు సార్లు మెడికల్ చెక్అప్ చేయించుకుంటారని, అందులో భాగంగానే సోమవారం ఎయిమ్స్‌కు వెళ్లారని ఆయా వర్గాలు స్పష్టం చేశాయి.
Last Updated : Dec 26, 2022, 6:27 PM IST