Finance Owner Murder: తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. నగరానికి చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ యజమానిని పట్టపగలే నడిరోడ్డుపై ఆరుగురు దుండగులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నైలోని చెట్పేట్కు చెందిన ఆరుముగం.. ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. బుధవారం అతడు తన స్నేహితుడు రమేష్‌తో కలిసి అన్నానగర్‌లో ఉన్న ఫైనాన్స్ కార్యాలయానికి వెళుతున్నాడు. మార్గమధ్యలో వారిని అడ్డగించిన దుండగులు నరికి చంపారు. వెంటనే ఘటనాస్థలం నుంచి నిందితులు పారిపోయారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి..చెన్నైలోని షెనాయ్నగర్కు చెందిన రోహిత్ రాజ్(31), చంద్రశేఖర్(28) అను ఇద్దరు యువకులు ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేశామని అంగీకరించి కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ 15 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఇక, మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.