తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంపర్ ఆఫర్:​ థియేటర్​లో ఒక టికెట్​ కొంటే ఇంకోటి ఫ్రీ! - కర్ణాటకలో సినిమా హాల్​ ఆఫర్లు

సినిమాకు వెళ్లినప్పుడు థమ్స్​అప్​ కొంటే పాప్​కార్న్ ఉచితంగా ఇస్తే.. వావ్ అనుకుంటాం కదూ. మరి అదే సినిమా టికెట్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ప్రకటిస్తే జనం ఎగబడిపోరూ?!?

Film theatre offers a unique "buy one ticket get one free"
బంపర్ ఆఫర్:​ ఆ థియేటర్​లో ఒక టికెట్​ కొంటే ఇంకోటి ఫ్రీ!

By

Published : Feb 17, 2021, 8:27 PM IST

కర్ణాటక బళ్లారిలోని ఓ మూవీ థియేటర్​..​ ప్రేక్షకులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచన చేసింది. తమ థియేటర్​లో ఒక టికెట్​ కొంటే మరో టికెట్​ ఫ్రీ అంటూ బంపర్​ ఆఫర్​ని ప్రకటించింది.

బంపర్ ఆఫర్:​ ఆ థియేటర్​లో ఒక టికెట్​ కొంటే ఇంకోటి ఫ్రీ!

కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో.. ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఈ ఆలోచన చేసినట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సూపర్​హిట్​ సినిమాలకు ఒక టికెట్​ తీసుకున్న ప్రేక్షకులకు మరో టికెట్​ ఉచితంగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.

అయితే.. ప్రస్తుతానికి బ్లాక్​ బాస్టర్​ మూవీ మేళా పేరిట ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు మాత్రమే ఈ ఆఫర్​ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

బంపర్​ ఆఫర్​ కోసం.. జనాల క్యూ..
సినిమా టికెట్​: ఒకటి కొంటే ఒకటి 'ఫ్రీ'!!

''ఈ ఆఫర్​తో కన్నడ, తెలుగు, తమిళ సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్​ ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్​లోనూ ప్రత్యేక రోజులు, మంచి సినిమాల విడుదల సమయంలో గురు, శుక్రవారాల్లో ఈ ఆఫర్​ పెడతాం.''

-లక్ష్మీకాంత రెడ్డి, థియేటర్​ యజమాని.

ఇదీ చదవండి:'చెక్'​ లిరికల్​ సాంగ్​.. '101 జిల్లాల అందగాడు' రిలీజ్​ డేట్​ ​​

ABOUT THE AUTHOR

...view details