Film maker molesting a girl: సినీ ఇండస్ట్రీలో పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తానని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. సినిమా ఛాన్స్ ఆశ చూపించి.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ కేసును విచారిస్తున్న ముంబయి పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354ఏ, పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు జరుపుతున్నారు.
బాలికపై అత్యాచారం..
Odisha Girl raped: మరోవైపు, ఒడిశా భువనేశ్వర్ శివారులో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కూలీ పని చేసుకునే బాలిక దగ్గరి బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను రేప్ చేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
బాధితురాలిని తొలుత బాలిపట్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని క్యాపిటల్ ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
మహిళపై సహోద్యోగి...