ఫిల్మ్‌మేకర్ ప్రకాశ్ ఝా తెరకెక్కిస్తున్న 'ఆశ్రమ్' వెబ్‌సిరీస్(Ashram Web Series News) మూడో సీజన్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో 'ఆశ్రమ్' సెట్‌పై భజ్రంగ్ దళ్ కార్యకర్తలు... ఆదివారం సాయంత్రం దాడి చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వెబ్‌సిరీస్‌ను(Ashram Web Series News) తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రకాశ్ ఝాపై(Prakash Jha News) సిరా జల్లారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆశ్రమ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లోకి(Ashram Web Series News) ప్రవేశించిన బజ్‌రంగ దళ్ కార్యకర్తలు రెండు బస్సుులపై రాళ్లు విసిరారని భోపాల్ ఎస్పీ సాయి కృష్ణ తోట తెలిపారు. షూటింగ్ జరగనివ్వబోమని బెదిరించారని, ఫిల్మ్‌మేకర్ ప్రకాశ్ ఝాపై సిరా జల్లారని చెప్పారు. ప్రొడక్షన్ సిబ్బందిలో ఒకరు గాయపడ్డారని పేర్కొన్నారు.
'ముందే తెలియజేయాలి'
'ఆశ్రమ్' సెట్ దాడిపై మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్ర సోమవారం స్పందించారు. తాము తీయబోయే కథల్లో ఏమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నట్లైతే.. షూటింగ్‌కు అనుమతి తీసుకునే సమయంలోనే వాటి గురించి అధికారులకు ముందే తెలియజేయాలని వ్యాఖ్యానించారు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ పేరును మార్చాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
"వెబ్ సిరీస్‌కు ఆశ్రమ్ అని పేరు ఎందుకు పెట్టాలి? వేరే మతానికి చెందిన పేర్లను పెడితే ఏం జరిగేదో వారికి తెలుస్తుంది. దాడి చేయడం మాత్రం తప్పే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశాం. వారిపై న్యాయపరమై చర్యలు తీసుకుంటాం. ప్రకాశ్ ఝా తన తప్పులను గురించి కూడా ఆలోచించుకోవాలి.
-నరోత్తమ్ మిశ్ర, మధ్యప్రదేశ్ హోం మంత్రి".
'చర్యలు తీసుకోవాలి..'