ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణంలో కీలకమైన పునాది పనులు ప్రారంభమైనట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. ఫౌండేషన్‌ను నింపే పనులు సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.
''బహుళ పొరలతో నిండి ఉండే పునాది పనుల తనిఖీ ప్రక్రియ పూర్తయింది. ఇక ఆలయ లేఅవుట్లో పెద్ద మార్పులేమీ ఉండవు.''
-చంపత్ రాయ్
అయోధ్య రామాలయాన్ని సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ పార్కోటా అనే రాతి గోడను నిర్మిస్తారు. భారీ వరదలను తట్టుకునే విధంగా భూమి లోపల నుంచి ఈ గోడలను నిర్మించనున్నారు. వచ్చే మూడేళ్లలో ఆలయ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. వీటితో పాటు.. ఇతర అన్ని పనులూ శరవేగంగా జరుగుతున్నాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ తెలిపారు.