తాము అధికారంలోకి వస్తే డ్రగ్ మాఫియాపై పోరుకే అధిక ప్రాధాన్యం ఇస్తామని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గంలో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు.
"వేలాది మంది, బహూశా లక్షలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. మేం అధికారంలోకి వస్తే.. ఈ మాఫియాను తమిళనాడు సహా మొత్తం భారత్లోనే లేకుండా చేస్తాం."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధినేత