అంతరించే ప్రమాదమున్న జీవజాతి అయిన 'ఆలివ్ రిడ్లే తాబేలు' పిల్లలను ఓ స్వచ్ఛంద సంస్థ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ట్రావెన్‌కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ.. ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లను సముద్రతీరం వద్ద గుర్తించింది. 52 రోజుల పాటు వాటిని సంరక్షించగా... గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాయి.
ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి విడుదల - కేరళ
అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను ఓ స్వచ్ఛంద సంస్థ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. తిరువనంతపురానికి చెందిన ట్రావెన్‌కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లను సముద్రతీరం వద్ద గుర్తించింది.
ఆలివ్ రిడ్లే తాబేలు
వాటిని కొల్లాం జిల్లా పోజిక్కరాకు తీసుకెళ్లిన సొసైటీ సభ్యులు సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు తీరంలో కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మత్య్సకారులను కోరారు.
ఇదీ చదవండి:కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్
Last Updated : Apr 14, 2021, 7:30 PM IST