నాలుగు రాష్ట్రాలు సహా.. ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో 'నోటా'ను చాలా తక్కువ మంది ఎంపిక చేసినట్లు ఈసీ ప్రకటించింది.
నోటాపై ఎన్నికల సంఘం లెక్కలిలా..
- అసోంలో పోలైన మొత్తం ఓట్లలో 1,54,399(1.22శాతం) మంది నోటాకు జైకొట్టారు.
- కేరళలో 91,715(0.5శాతం) మంది ఓటర్లు నోటాకు ఓటేశారు.
- తమిళనాడులో పోలైన మొత్తం ఓట్లలో 1,84,604(0.78శాతం)మంది నోటా మీటను నొక్కారు.
- బంగాల్‌లో 5,23,001(1.1శాతం) మంది నోటాను ఉపయోగించుకున్నారు.
- పుదుచ్చేరిలో 9,006(1.30శాతం) మంది 'పై వారు ఎవరూ కాదని' తెలిపారు.