illegal sex determination racket In Dharmapuri: గర్భస్త శిశివులకు లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న ముఠాను చెన్నై ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. రాజపెట్టాయి సమీపంలో లింగ నిర్ధరణ పరీక్షలతో పాటు అబార్షన్ చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వైద్యశాఖ, పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితులను జ్యోతి(33), సతీశ్‌కుమార్(37), సుధాకర్(37), కర్పగం(38), సరిత(40), కుమార్(38), వెంకటేషన్(33)గా గుర్తించారు.
రూ.6వేలకే లింగ నిర్ధరణ, అబార్షన్.. ముఠా అరెస్ట్ - లింగ నిర్ధరణ పరీక్ష
illegal sex determination racket In Dharmapuri: అక్రమంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు చెన్నై ధర్మపురి పోలీసులు. ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి స్కానింగ్ మెషీన్, రెండు కార్లు, ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.
illegal sex determination racket In Dharmapuri
ధర్మపురిలో నర్సుగా పనిచేసే కర్పగం.. గర్భస్త శిశువులకు అక్రమంగా లింగ నిర్ధరణ పరీక్షలతో పాటు అబార్షన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షల కోసం బాధితుల వద్ద నుంచి రూ.6,000 తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, ఆటో, స్కూటర్, స్కానింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:మరణాన్ని ముందుగానే ఊహించిన సిద్ధూ మూసేవాలా?