తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజలకు మోదీ సహా ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ, రాష్ట్రపతి సహా పలవురు ప్రముఖ నేతలు. హోలీ పండుగ సంతోషానికి సంకేతం అని మోదీ ట్వీట్ చేశారు.

leaders extends holi wishes
'సంతోషానికి సంకేతం ఈ హోలీ'

By

Published : Mar 29, 2021, 9:47 AM IST

హోలీ పండుగ ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్​ చేశారు.

దేశవ్యాప్తంగా హిందువులతో పాటు ఇతర మతాల వారు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సామూహిక వేడుకలపై ఆంక్షలు విధించారు.

శుభాకాంక్షలు తెలిపిన నేతలు..

"అందరికి హోలీ శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ మీ జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల్ని నింపాలని కోరుకుంటున్నా."

-- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ శాఖ మంత్రి.

"ఐకమత్యానికి, మంచితనానికి సంకేతమైన ఈ రంగుల పండుగ మీ జీవితాల్లో శాంతిని, సంతోషాన్ని నింపాలి. దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు."

--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

"రంగుల పండుగ హోలీ ప్రజల్లో నమ్మకాన్ని, సంతోషాన్ని నింపాలి. ఈ పండుగ భారతీయ సంస్కృతిని, జాతీయతను మరింత బలపరుస్తుందని ఆశిస్తున్నాను."

--రామ్​నాధ్​ కోవింద్, రాష్ట్రపతి.

"కొవిడ్​ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. హోలీ పండుగను జరుపుకోవాలి. అందరికి హోలీ శుభాకాంక్షలు."

--వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

ఇదీ చదవండి:కరోనా వ్యాప్తితో చదువులకు తాళం

ABOUT THE AUTHOR

...view details