celebrations at crematorium: అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో శ్మశానంలో వాతావరణం మొత్తం బంధువుల ఆర్తనాదాలు, కన్నీటితో నిండిపోయి ఉంటుంది. కానీ, ఉత్తర్ప్రదేశ్, వారణాసిలోని మణికర్ణిక ఘాట్ (కాశీ శ్మశానవాటిక) వద్ద డీజే పాటలు, డ్యాన్సులు కనిపించాయి. ఓవైపు చితి మంటలు మండుతూనే ఉన్నాయి.. మరోవైపు సంతోషంగా ఉత్సవాలు నిర్వహించారు. బాబా భోలేనాథ్ ముందు నగర్వధువులు(నృత్యకారులు) డ్యాన్సులు చేశారు. వారిపై కొందరు నోట్ల వర్షం కురిపించారు.
అలా ఎందుకు చేస్తారు?:ఇలా చితి మంటల మధ్య నృత్యాలు, ప్రార్థనలు చేసే సంప్రదాయం 378 ఏళ్లుగా వస్తున్నట్లు బాబా మహాశ్మశాన్ నాథ్ ఆలయ అధికారి గుల్షాన్ కపూర్ తెలిపారు. " ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. బాబా మహాశ్మశాన్ నాథ్ ఆలయాన్ని రాజా మాన్సింగ్ పునర్నిర్మింమించారు. అయితే, ఆలయంలో పాటలు పాడటం, నృత్యాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజా మాన్సింగ్ కలత చెందారు. ఈ విషయం నగరం మొత్తం వ్యాపించింది. సంస్థానంలోని నగర్వధువులకు ఈ విషయం తెలిసింది. ఈ అవకాశం తమకు ఇస్తే నగరంలోని నృత్యాకారులంతా బాబా ముందు ప్రదర్శన చేసేందుకు వస్తారని రాజుకు తెలియజేశారు. వెంటనే వారికి అవకాశం కల్పించారు రాజు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నడుస్తోంది." అని తెలిపారు కుల్షాన్.