తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్​.. ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్రం నిర్ణయం

Fertilizer Subsidy News : దేశంలోని రైతులకు కేంద్రం గుడ్​న్యూస్ చెప్పింది. ఎరువుల ధర పెంచకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్​కు సంబంధించి రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

fertilizer subsidy news
fertilizer subsidy news

By

Published : May 17, 2023, 5:03 PM IST

Updated : May 17, 2023, 5:33 PM IST

Fertilizer Subsidy News : ఎరువుల ధరలు పెంచకూడదని.. కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్​కు సంబంధించి రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూరియాకు 70 వేల కోట్లు, DAPకి 38 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. సకాలంలో ఎరువులు అందించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు వాటి భారం రైతులపై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. గతేడాది ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సబ్సిడీ వల్ల దాదాపు 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఐటీకీ రూ.17 వేల కోట్ల ప్రోత్సాహకాలు
పెట్టుబడులను ఆకర్షించడం, భారతీయ కంపెనీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్​ఐ) స్కీమ్​కు ఐటీ హార్డ్​వేర్​కు అనుసంధానించింది కేంద్రం. ఈ స్కీమ్​లో ఆరు సంవత్సరాల కాలానికి రూ.17 వేల కోట్ల బడ్జెట్​ను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

'ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేవలం 20-29 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగం.. గత తొమ్మిదేళ్లలో 100 బిలియన్ డాలర్లు దాటింది. టెలికాం రంగంలో భారత్ వృద్ధి చెందుతోంది. కేవలం రూ. 900 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు.. రూ.1600 కోట్లు వచ్చాయి.' అని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

సహకారం సంఘాలను బలోపేతానికి కృషి..
దేశంలో సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డైరీ-ఫిషరీ క్రెడిట్‌ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డైరీ-ఫిషరీ క్రెడిట్‌ సొసైటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఈ సొసైటీలు ఏర్పాటుకాని గ్రామాలు, పంచాయతీల్లో ఐదేళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేశంలో 63వేల ప్రాథమిక వ్యవసాయ క్రిడెట్ సొసైటీలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. 2 లక్షల సొసైటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను నాబార్డ్​, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్, నేషనల్ ఫిషరీ డెవలప్‌మెంట్ బోర్డ్ రూపొందిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటుగా మత్స్య, పశుసంవర్ధక శాఖలను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. డైరీ-ఫిషరీ క్రెడిట్‌ సొసైటీల ఏర్పాటు ద్వారా రైతు సభ్యులకు వారి ఉత్పత్తులకు సరైన మార్కెట్​, ఆదాయాలు మెరుగుపడటం వంటి పలు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : May 17, 2023, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details