మనిషికి జీవిత ఖైదు విధించడం చూస్తుంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లోని ఓ కోతి జీవిత ఖైదు అనుభవిస్తోంది. అందుకు కారణం మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే. సుమారు ఐదేళ్ల నుంచి జూలో ఓ బోనులో ఉంటోంది. అక్కడి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా ఆ కోతి మానసిక స్థితిలో ఎటువంటి మార్పులేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పట్లో ఓ వానరాన్ని విడుదల చేయబోమని అంటున్నారు.
కోతికి 'జీవిత ఖైదు'.. ఇప్పటికే ఐదేళ్లు శిక్ష పూర్తి.. వానరం చేసిన నేరం ఇదే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జూలో ఓ కోతి జీవిత ఖైదు అనుభవిస్తోంది. అదేంటి సాధారణంగా మనుషులే కదా ఇలాంటి శిక్షలు అనుభవిస్తారు, కోతి బంధీగా ఉండడమేంటని అనుకుంటున్నారా? కానీ అది అక్షరాలా నిజం. అసలు ఆ కోతి బంధీగా ఎందుకు ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి.
బోనులో బంధీగా ఉన్న కోతి పేరు కాలియా. ఇది తాంత్రికుడి దగ్గర పెరిగింది. అయితే మాంత్రికుడు వానరానికి మద్యం, మాంసాహారం అలవాటు చేశాడు. కొన్నాళ్ల క్రితం మాంత్రికుడు మరణించాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన వానరం.. మీర్జాపుర్‌లో 250 మందిపై దాడి చేసింది. 2017లో స్థానికుల ఫిర్యాదుతో.. అతికష్టం మీద అటవీ అధికారులు వానరాన్ని బంధించారు. అప్పటి నుంచి జూలో బందీగా ఉంచారు అధికారులు.
"కాలియాను తాంత్రికుడు మద్యం, మాంసాహారం అలవాటు చేశాడు. జౌన్‌పుర్‌లో మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తలుపై దాడి చేసి పలుమార్లు మద్యం సేవించింది. వానరానికి తాంత్రికుడు శిక్షణ ఇచ్చాడు. కోతి మానసిక స్థితి మెరుగుపడితే అడవిలో వదిలేందుకు సన్నాహాలు చేశాం. అయితే ఐదేళ్లగా శిక్ష అనుభవించినా ఎటువంటి మార్పులేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలియాను బయటకు వదిలేసి ప్రజలకు చాలా ప్రమాదం. అందుకే బంధీగానే ఉంచుతున్నాం."
-- నాజర్, కాన్పుర్ జూ వైద్యుడు