ప్రసుత్త రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అంగడి నుంచి అంతరిక్షం వరకు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పరిస్థితులకు తగ్గట్లు తమ జీవితాన్ని, భవిష్యత్తును మార్చుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ కోవకే చెందిన ఓ యువతి.. ఇంజినీరింగ్ చదివి.. అనేక సంస్థల్లో పనిచేసి.. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్‌గా స్థిరపడింది.
బంగాల్లోని కోల్‌కతాకు చెందిన దీప్తా ఘోష్ అనే యువతి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పాసైంది. వివిధ కంపెనీల్లో ఆరు సంవత్సరాల పాటు పని చేసింది. మూడేళ్ల క్రితం 2020లో ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. దీంతో ఆమె కుటుంబానికి డబ్బు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే దీప్తా ఘోష్ జీతం.. కుటుంబాన్ని పోషించేందుకు సరిపోలేదు. దీంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వెతికింది. కోల్‌కతా దాటి వెళ్లి చేయాల్సిన ఉద్యోగాలు వచ్చాయి.
కానీ తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని, చెల్లిని వదిలిపెట్టి వెళ్లడం ఆమెకు నచ్చలేదు. అందుకు ఉద్యోగం కోసం వెతకడం మానేసింది. అప్పటికే ఆమెకు డ్రైవింగ్‌లో కాస్త అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొందరి సహాయంతో లైసెన్స్ పొందింది. కొన్ని రోజుల పాటు కారు డ్రైవింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత 2021లో కారును కొనుగోలు చేసింది. క్యాబ్ డ్రైవర్‌గా మారి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది!