హరియాణాలో డీఎస్పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్‌లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.
మృతురాలు సంధ్యా టోప్పో తుపుదానా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఘోరం.. వాహనంతో ఢీకొట్టి మహిళా ఎస్సై హత్య
ఝార్ఖండ్‌లో సబ్ ఇన్స్పెక్టర్ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్సైపైకి వాహనాన్ని పోనిచ్చారు.
murder-of-female-inspector
Last Updated : Jul 20, 2022, 10:09 AM IST