తృణమూల్ కాంగ్రెస్‌పై.. బంగాల్ మాజీ మంత్రి సువేంధు అధికారి మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 21ఏళ్ల పాటు ఆ పార్టీలో భాగమైనందుకు నిజంగా సిగ్గు పడుతున్నానని తెలిపారు. అంతేకాక, టీఎంసీ ఒక కంపెనీ అని.. పార్టీలో అసలు క్రమశిక్షణకు తావులేదన్నారు.
21ఏళ్లుగా ఆ(టీఎంసీ) పార్టీలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ అసలు ఉండదు. అదొక కంపెనీ లాంటిది. ఇటీవలే నేను ఆ కంపెనీ నుంచి బయటికొచ్చి.. సరైన రాజకీయ పార్టీలో చేరాను. తృణమూల్ పాలన 'పార్టీ కోసం' మాత్రమే అనే సంస్కృతిని బంగాల్ ప్రజలకు అలవర్చింది. అంతకు ముందు 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఐ-ఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మమతా పాలన కొనసాగింపు.