తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​! - భర్తపై భార్య హత్యాయత్నం

భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఓ భార్య కరెంట్​ షాక్​ ఇచ్చి హత్యచేసేందుకు యత్నించిన ఘటన రాజస్థాన్​ చురు జిల్లాలో జరిగింది. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

woman gives electric shocks to husband
భర్తకు కరెంట్​ షాక్​ ఇచ్చి హత్యాయత్నం

By

Published : Aug 19, 2021, 12:33 PM IST

కుటుంబ కలహాలతో భార్యభర్తల మధ్య గొడవలు ఒకరినొకరు చంపుకొనే దాకా వెళ్లిన ఘటనలు ఇటీవల పెరిగాయి. అలాంటి ఘటనే రాజస్థాన్​ చురు జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఓ భార్య.. అతనికి కరెంట్​ షాక్​ ఇచ్చి హత్యాయత్నం చేసిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడు ప్రస్తుతం జిల్లాలోని బికనేర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 12న సాయంత్రం బాధితుడు మహేంద్ర దాన్​(32) పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత భర్తకు భోజనం వడ్డించింది అతని భార్య సుమన. ఈ క్రమంలోనే మహేంద్ర స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతని చేతులను పాలిథిన్​ బ్యాగులు, కాళ్లను విద్యుత్తు తీగలతో కట్టేసింది భార్య. ఆ తర్వాత కరెంట్​ షాక్​ పెట్టింది. దాంతో అతనికి మెలుకువ వచ్చింది. భయపడిన సుమన.. వెంటనే ఇరుగుపొరుగువారిని పిలిచి, తన భార్తకు విద్యుత్తు షాక్​ కొట్టిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది. స్థానికుల సాయంతో అదే రాత్రి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి బికనేర్​ జిల్లా పీబీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి హిమ్మత్​ సింగ్​ తెలిపారు. ​బాధితుడు, అతని తండ్రి వాంగ్మూలాలు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే.. ఇప్పటి వరకు సుమనను అరెస్ట్​ చేయలేదన్నారు.

ఇదీ చూడండి:కదిలే కారులో యువతిపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details