తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరీక్షా పే చర్చ- ఏపీ విద్యార్థిని ప్రశ్నకు మోదీ సమాధానం - పరీక్షా పే చర్య లేటెస్ట్ అప్​డేట్స్

పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాన్ని తొలగిస్తే వారు ఒత్తిడికి గురి కారని ప్రధాని మోదీ అన్నారు. విద్యార్థులతో ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షా పే చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు మోదీ.

Priska Pe Charcha 2021
పరీక్షా పే చర్చ 2021

By

Published : Apr 7, 2021, 7:53 PM IST

Updated : Apr 7, 2021, 8:03 PM IST

విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే వారికి పరీక్షల భయం చాలా వరకు తగ్గిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల కాలం నేపథ్యంలో భయాన్ని తొలగించి వారిలో నమ్మకాన్ని పెంచడం కోసం మోదీ పరీక్షాపై చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు.

వర్చువల్‌ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు, అధ్యాపకులతో కూడా మోదీ సంభాషించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పల్లవి అనే 9వ విద్యార్థిని.. పరీక్షల సమయం దగ్గరకు వచ్చే సమయంలో తలెత్తే ఆందోళనను ఎలా తొలగించుకోవాలని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు.

విద్యార్థులపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, మిత్రులు ఒత్తిడి చేయడం మానేస్తే పరీక్షలు అనేవి వారికి చాలా సులభతరంగా మారుతాయని మోదీ అన్నారు. జీవితంలో ఎన్నో దశలు ఉంటాయని, పరీక్షలు కూడా ఓ దశ అని అభిప్రాయపడ్డారు. అందువల్ల విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని వారిలో భరోసా నింపారు.

ఇదీ చదవండి:పని ప్రదేశాల్లో కరోనా టీకాలు- కేంద్రం నిర్ణయం

Last Updated : Apr 7, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details