FCI Jobs 2023 :ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగం సంపాందించాలని కలలు కనే ఆశావాహులకు గుడ్‌న్యూస్. ఎఫ్‌సీఐ తమ సంస్థలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తంగా 5000 పోస్టులకు సంబంధించి నియమకాల ప్రక్రియను చేపెట్టేందుకు సిద్ధమైంది ఎఫ్‌సీఐ.
పోస్టులు..
FCI Recruitment Posts : వాచ్మెన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, జూనియర్ ఇంజినీర్, టైపిస్ట్, కేటగిరీ-III సహా ఇతర పోస్టులు.
మొత్తం ఖాళీలు..
FCI Total Vacancy : 5000 పోస్టులు
విద్యార్హతలు..
FCI Jobs Eligibility : డిగ్రీ, డిప్లొమా, బీటెక్/ఇంజినీరింగ్, 8వ తరగతి(వాచ్మెన్ పోస్టుకు)
ఏజ్ లిమిట్..
FCI Jobs Age Limit : 25-27 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు రుసుము..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
- ఇతరులకు- రూ.250/-
పరీక్ష తేదీ..
FCI Jobs Exam Dates :ఈ ఏడాది డిసెంబర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు..
FCI Recruitment Important Dates :నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలైన దరఖాస్తు ప్రారంభ తేదీతో పాటు చివరితేదీల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
జాబ్ లొకేషన్..
FCI Job Location :దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కల్పిస్తారు.
జీతభత్యాలు..
FCI Jobs Salary : రూ.10,000 నుంచి రూ.30,000
ఎంపిక విధానం..
FCI Selection Process : రాతపరీక్ష, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ పోస్టులను అనుసరించి ఎంపిక ప్రక్రియలో మార్పులు ఉండవచ్చు.
వెబ్సైట్..
FCI Website :వివిధ పోస్టులకు సంబంధించిన సిలబస్, వయోపరిమితి సడలింపులు తదితర వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ www.fci.gov.in ను వీక్షించండి.
నేడే లాస్ట్‌డేట్..
- HAL Apprentice Jobs 2023 : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో 647 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుకు చివరితేదీ ఈరోజే (ఆగస్టు 23). పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
- SSC Stenographer Vacancy 2023 :కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ కింద మొత్తం 1207 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ). ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానిక చివరితేదీ నేడే (ఆగస్టు 23). నోటిఫికేషన్‌కు సంబంధించిన తదితర వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Postal GDS Notification 2023 : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 జీడీఎస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 3 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది తపాలా శాఖ. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు ఈ రోజు (ఆగస్టు 23)తో ముగియనుంది. పూర్తి వివరాలు కోసం ఈ లింక్‌ను తెరవండి.