తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Facebook Rahul: ఫేస్‌బుక్‌ నుంచి రాహుల్‌ పోస్టు తొలగింపు - దిల్లీ దళిత బాలిక హత్యాచారం

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి (Facebook Rahul) మరో సామాజిక మాధ్యమం షాక్​ ఇచ్చింది. ఇటీవల పోస్టు చేసిన ఓ చిత్రాన్ని శుక్రవారం తొలగించింది ఫేస్​బుక్​(Facebook). ఫొటోల షేరింగ్‌ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) వివాదాస్పద పోస్టును తొలగించారు.

FB, Instagram remove Rahul Gandhi's post
ఫేస్‌బుక్‌ నుంచి రాహుల్‌ పోస్టు తొలగింపు

By

Published : Aug 21, 2021, 7:24 AM IST

Updated : Aug 21, 2021, 10:22 AM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ.. మరో సామాజిక మాధ్యమ వేదిక (Facebook Rahul) నుంచి కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఇటీవల పోస్టు చేసిన ఓ చిత్రాన్ని ఫేస్‌బుక్‌ శుక్రవారం తొలగించింది.

'మా సంస్థ విధానాలను ఉల్లంఘించేలా ఉన్న రాహుల్‌ గాంధీ (Facebook Rahul) పోస్టును తొలగించాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని రాహుల్‌కు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌)కు తెలియజేశాం' అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఈమెయిల్‌ ద్వారా వెల్లడించారు. భారతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

ఫేస్‌బుక్‌ సంస్థకే చెందిన ఫొటోల షేరింగ్‌ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా రాహుల్‌ గాంధీ వివాదాస్పద పోస్టును తొలగించారు. హత్యాచార బాధిత బాలిక కుటుంబ సభ్యుల చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై ఎన్‌సీపీసీఆర్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమ వేదికను ఆదేశించిన విషయం తెలిసిందే.

వాయవ్య దిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక తల్లిదండ్రులను పరామర్శించే క్రమంలో రాహుల్‌ వారితో తీసుకున్న ఫొటో, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ట్విట్టర్‌ ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతల ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని గుర్తించేలా ఉన్న ఆ చిత్రాలను బహిర్గతం చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. రాజకీయంగానూ దుమారం చెలరేగింది.

ఇదీ చూడండి:రాహుల్​కు మరో షాక్​.. ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​ ఖాతాపై!

Last Updated : Aug 21, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details