తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి.. ఆపై ఉరేసుకొని ఆత్మహత్య - Shocking incident in Ambikapur

Father suicide after poisoning children: కన్నబిడ్డలకు విషం ఇచ్చి.. అనంతరం తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యాపారవేత్త. ఈ ఘటనలో వ్యాపారవేత్త, అతని కూతురు మరణించారు. ఏడాదిన్నర కుమారుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

Father suicide after poisoning children
Father suicide after poisoning children

By

Published : Mar 7, 2022, 8:39 PM IST

Father suicide after poisoning children: ఛత్తీస్​గఢ్​ సుర్గుజాలో హృదయ విదారక ఘటన జరిగింది. అంబికాపుర్​లో ఓ వ్యాపారవేత్త తన పిల్లలకు విషం ఇచ్చి చంపేశాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రితో పాటు ఎనిమిదేళ్ల కూతురు మరణించగా.. ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడన్న విషయం తెలియలేదు.

Father poisoned kids

సుదీప్ మిశ్ర అనే వ్యాపారి.. వసుంధర విహార్ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకున్నాడని స్థానిక ఏఎస్పీ వివేక్ శుక్లా పేర్కొన్నారు. అతడి ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇరువురినీ ఆస్పత్రికి తరలించగా.. ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

సుదీప్ మిశ్ర.. గోదాన్​పుర్​లో సిమెంట్ వ్యాపారం చేసేవారని పోలీసులు చెప్పారు. తన భార్యను మార్కెట్​కు పంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details