తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముజఫర్​నగర్​ బాలిక హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు - బాలిక హత్యకేసులో తీర్పు

2011లో ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​ జిల్లా ఖోజా నగలా గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక హత్య కేసులో జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదుగురిని దోషులుగా తేల్చుతూ జీవిత ఖైదు విధించింది.

muzzafarnagar
ముజఫర్​నగర్​ బాలిక హత్య కేసులో జిల్లా కోర్టు తీర్పు

By

Published : Mar 6, 2021, 4:46 PM IST

నాలుగేళ్ల బాలికను అపహరించి హత్య చేసిన కేసులో ముజఫర్​నగర్​ జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నిందితులు ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే.. ఒక్కొరికి రూ.60వేల చొప్పున జరిమానా విధించింది.

ఇదీ జరిగింది..

2011 డిసెంబర్లో​ ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​ జిల్లా ఖోజా నగలా గ్రామంలో నాలుగేళ్ల బాలిక.. తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లింది. ఎంతకి తిరిగి రాలేదు. కేసులో ప్రధాన నిందితుడు సొహేల్​ సహా అతని కుమారులు హుస్సేన్, తన్​వీర్, పర్వేజ్​, కలీమ్​లు.. బాలికను అపహరించి వారి ఇంట్లో నిర్బంధించారు. కానీ ఆ బాలిక ఏడుస్తుండటం వల్ల వారిని ఎవరైనా గుర్తిస్తారనే భయంతో నిందితులు ఆమెను హత్య చేశారు. బాలిక మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి :'ప్రజాస్వామ్యంపై భారత్​కు మీ పాఠాలు అనవసరం'

ABOUT THE AUTHOR

...view details