తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంటు లేదని నదిలో స్నానానికి వెళ్లి.. తండ్రి, కుమారుడు మృతి - ఒడిశా సంబల్​పుర్​ వార్తలు

నదిలో స్నానానికి వెళ్లిన తండ్రి, ఇద్దరు పిల్లలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్​పూర్​లో జరిగింది. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

sambalpur news latest
కరెంటు లేదని నదిలో స్నానానికి వెళ్లి తండ్రి, పిల్లలు మృతి

By

Published : Oct 4, 2021, 8:13 PM IST

Updated : Oct 4, 2021, 8:28 PM IST

ఒడిశా సంబల్​పూర్​ జిల్లా దలయ్​గుడా మహానదీ ఘాట్​లో దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. నదిలో స్నానానికి దిగారు. చివరికి వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఇదీ జరిగింది..

ఘాట్​ సమీపంలో నివసిస్తున్న మహమ్మద్​ అల్తాఫ్​.. ఇంట్లో కరెంటు లేకపోవడం వల్ల అక్కడే ఉన్న నదిలో స్నానం చేయాలని వెళ్లాడు. అతని వెంట కుమారుడు మహమ్మద్​ అఫ్తాఫ్​, కుమార్తె రుక్సానా కూడా వచ్చారు. మొదట నదిలోకి దిగిన కుమార్తె రుక్సానా.. ప్రవాహం ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రుక్సానాను రక్షించేందుకు నదిలోకి దూకిన అల్తాఫ్​, అఫ్తాఫ్​లు కూడా నీటిలో కొట్టుకుపోయారు.

గాలింపు చర్యలు చేపడుతున్న సిబ్బంది
అఫ్తాఫ్​ మృతదేహాన్ని వెలికితీసిన స్థానికులు

ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. గల్లంతైన వారి ఆచూకీ కనుగునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అల్తాఫ్​ అతని కుమారుడు అఫ్తాఫ్​ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాధితురాలు రుక్సానా ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటన సోమవారం సాయంత్రం 4.50 గంటలకు జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

ఇదీ చూడండి :'రేప్​కు యత్నం.. ప్రతిఘటించిందని పెట్రోల్​ పోసి నిప్పు!'

Last Updated : Oct 4, 2021, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details