Father Rapes Minor Daughter: గుజరాత్, వడోదరలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు(17)పైనే ఓ తండ్రి అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చటం వల్ల విషయం బయటపడింది.
ఇదీ జరిగింది..
కొన్నేళ్ల క్రితం బాలిక తల్లి మరణించింది. దీంతో తండ్రి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కూతురుపై కన్నేశాడు తండ్రి. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అనారోగ్యానకిి గురైంది. ఆరోగ్యం దెబ్బతిన్న బాలికను ఆమె మేనత్త డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాలిక 18 వారాల గర్భవతి అని వైద్యులు తెలిపారు.