Father rape daughter: తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తండ్రి తన కన్నకూతురిపై పశువులా మీదపడి కోరిక తీర్చుకున్న అవమానకర ఘటన ఇందోర్‌లో జరిగింది. 11ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు నిందితుడు. సౌదీ అరేబియాలో ఓ పెట్రోలియం కంపెనీలో పనిచేసే అతడు.. రెండేళ్ల కోసారి ఇందోర్‌కు వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూతురిపై రేప్ చేసేవాడు. తండ్రి క్రూరత్వాన్ని భరించలేని ఆ చిన్నారి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.
చిన్నప్పటి నుంచి తన తండ్రి అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు గోడు వినిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు, చాక్లెట్ల ఆశ చూపించి.. రహస్య భాగాలను తాకేవాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అత్యాచారం చేసేవాడని చెప్పింది. చివరకు, ఈ విషయం తల్లికి చెప్పింది బాధితురాలు. మొదట దీని గురించి ఆమె నమ్మలేదు. అయితే, కూతురు గట్టిగా చెప్పేసరికి తల్లి విశ్వసించింది. కూతురిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. నిందితుడిపై ఫిర్యాదు చేయగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
UP rape news:ఉత్తర్‌ప్రదేశ్ ఎటాలో ఆరేళ్ల బాలికపై 15ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు, బాధితురాలు ఒకే గ్రామానికి చెందినవారని అదనపు ఎస్పీ ధనంజయ్ కుష్వాహా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని.. చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.