తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమానవీయం.. స్నేహితులతో కలిసి సొంత కుమార్తెపైనే.. - ఛత్తీస్​గఢ్​

Father raped minor daughter: కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతక తండ్రి. మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Father rape child news
Father raped daughter

By

Published : May 2, 2022, 7:10 AM IST

Updated : May 2, 2022, 8:06 PM IST

Father raped minor daughter: ఛత్తీస్​గఢ్​లోని జష్​పుర్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో కన్న కూతురిపైనే స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..:"నారాయణ్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు నిందితుడు. నిందితుడి భార్య 2019లో చనిపోయింది. ఏప్రిల్ 28న రాత్రి మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు నిందితుడు. తన ఇద్దరు తమ్ముళ్లతో (మూడేళ్లు, ఆరేళ్ల వయసున్నవారు) కలిసి నిద్రపోతున్న తొమ్మిదేళ్ల కూతురిని స్నేహితుల సహకారంతో పక్క గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన అనంతరం తమ అమ్మమ్మకు సమాచారం అందించింది బాలిక. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు" అని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

సమీప గ్రామంలో తమ అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో బాలిక మూడో తరగతి చదివేదని తెలిపారు. పాఠశాలకు సెలవులు ఇవ్వగా, చిన్నారిని ఆమె తండ్రి వద్దకు తీసుకొచ్చింది అమ్మమ్మ. ఆ తర్వాత ఈ దారుణం జరిగింది.

ఇదీ చూడండి:మైనర్​పై గ్యాంగ్​రేప్​.. ఆరుగురికి జీవిత ఖైదు

Last Updated : May 2, 2022, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details