తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు నెలలుగా కూతురిపై తండ్రి అత్యాచారం - సామూహిక అత్యాచారం

Father raped daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తోడుగా నిలవాల్సిన నాన్నే నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్​లో వెలుగుచూసింది.

Father raped daughter
Father raped daughter

By

Published : Mar 5, 2022, 1:49 AM IST

Updated : Mar 5, 2022, 6:20 AM IST

Father raped daughter: ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్‌పుర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతక తండ్రి.. 13ఏళ్ల కుమార్తెపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

గతంలో ఆరు కేసులు..

ఓ బాలిక తన తండ్రితో పాటు షాజహాన్​పుర్​లో నివాసం ఉంటుంది. అతడి దుష్ప్రవర్తనను భరించలేక ఏడాది క్రితమే భార్య విడిచిపెట్టింది. అప్పటి నుంచి అతడు కూతురుతోనే కలిసి ఉంటున్నాడు. కొన్నాళ్లు తర్వాత కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ తండ్రి.. కన్న కూతురితోనే అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

ఎలాగో ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాధిత బాలిక.. పోలీసులను ఆశ్రయించింది. ఏడాది కాలంగా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. భార్యలానే ఉండాలని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. గతంలో నిందితుడిపై హత్యతో పాటు ఆరు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సామూహిక అత్యాచారం

రాజస్థాన్​ సవాయ్​ మధోపుర్​ జిల్లా 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. తనపై ముగ్గురికిపైగా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:వామ్మో వీళ్లేం దొంగలు- స్పూన్​ కూడా వదల్లేదు!

Last Updated : Mar 5, 2022, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details