Father of bride killed on Wedding Day : కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదని ఓ వృద్ధుడిని చంపేశాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళ.. తిరువనంతపురం జిల్లాలోని కల్లంబలంలో బుధవారం జరిగింది. అయితే హత్య జరిగిన రోజే మృతుడి కుమార్తె పెళ్లి కావడం విశేషం. ఈ కేసులో నిందితుడిని, అతడికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు, మృతుడి ఇంటి పొరుగువారేనని పోలీసులు తెలిపారు. మృతుడిని రాజు(61)గా గుర్తించారు. రాజు కొన్నాళ్లు గల్ఫ్‌లో పనిచేశాడని.. ప్రస్తుతం అతడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
పెళ్లికి ఒప్పుకోలేదని పగ.. వివాహం రోజే వధువు తండ్రి హత్య.. పారతో కొట్టి.. - కేరళ రాజు మర్డర్ కేసు
Father of bride killed on Wedding Day : తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు నిరాకరించాడని ఓ వృద్ధుడిని పారతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి. అతడికి మరో ముగ్గురు సహకరించారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
మృతుడు రాజు తన కుటుంబంతో కలిసి కలిసి కల్లంబలంలో నివసించేవాడు. అతడి ఇంటి పొరుగున ఉన్న జిష్ణు.. రెండేళ్ల కిందట శ్రీలక్ష్మిని వివాహం చేసుకుంటామని రాజును అడిగాడు. జిష్ణు ప్రతిపాదనను రాజు తిరస్కరించాడు. దీంతో అప్పటి నుంచి రాజుపై జిష్ణుపై కోపం పెంచుకున్నాడు. శ్రీలక్ష్మికి వివాహం జరగనుందని తెలిసి జిష్ణు పగ మరింత పెంచుకున్నాడు. బుధవారం తన సోదరుడు జిజిన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాజు కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో వధువు శ్రీలక్ష్మి సహా ఆమె సోదరుడు, తల్లి కూడా గాయపడ్డారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి తండ్రి రాజు తలపై పారతో దాడి చేశారు. దీంతో అతడు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
నిందితుడికి నేరచరిత్ర ఉందని.. అందుకే రాజు.. శ్రీలక్ష్మిని అతడికి ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదని మృతుడి బంధువు ఒకరు తెలిపారు. శ్రీలక్ష్మి పీజీ చదివిందని.. నిందితుడు జిష్ణు.. గ్రాడ్యుయేషన్ కూడా చదవలేదని చెప్పారు. తన కుమార్తెతో పెళ్లికి తిరస్కరించిన తర్వాత.. నిందితుడు జిష్ణు పలుమార్లు రాజు కుటుంబాన్ని బెదిరించాడని అన్నారు.