మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ప్రత్యేకమైన వివాహం జరిగింది. ఓ తండ్రి తన దివ్యాంగురాలైన కూతురిని శ్రీకృష్ణుడికి(భగవంతుడు) ఇచ్చి వివాహం చేశాడు. బంధుమిత్రుల మధ్య హంగు ఆర్భాటాలతో వివాహ వేడుక నిర్వహించాడు.
శిశుపాల్ రాథోడ్ మోహన ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కూతురు(26) ఉంది. అయితే 21 సంవత్సరాలుగా ఆమె మంచానికే పరిమితం అయ్యింది. కనీసం మాట్లాడలేదు, చెవులు సైతం వినపడవు. కూతురు పట్ల శిశుపాల్ ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. అందరి అమ్మాయిల్లాగానే తన కూతురికి వివాహం చేయాలనుకునేవాడు. కానీ, చికిత్స వల్ల ఎలాంటి మార్పులు రాకపోయేసరికి.. యువతిని సంతోషపెట్టేందుకు భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయించాలని అనుకున్నాడు.
దివ్యాంగురాలైన కూతురిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసిన తండ్రి - శ్రీకృష్ణుడితో కూతురికి పెళ్లి జరిపిన తండ్రి
తన దివ్యాంగురాలైన కూతురిని భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఓ వ్యక్తి. 21 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయిన ఆమె పెళ్లిని బంధుమిత్రుల మధ్య ఘనంగా చేశాడు.
శ్రీకృషున్ని పెళ్లాడిన వికలాంగురాలు
వెంటనే, ఈ నెల 6వ తేదిన బంధువులకు ఫోన్ చేసి మరుసటి రోజు తన కూతురు పెళ్లి ఉందని కచ్చితంగా రావాలని ఆహ్వానించాడు. భగవంతుడు శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లిని శివపాల్ ఘనంగా నిర్వహించాడు. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించాడు. గుడిలో నిర్వహించిన ఈ పెళ్లి బంధుమిత్రుల మధ్య సంబరంగా జరిగింది. అంతా ఆనందాన్ని పంచుకుని చివరగా డీజేకు డ్యాన్సులు సైతం చేశారు.