Father killing daughter:భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి సొంత కూతురిని హత్య చేశాడు. కోపంలో ఏడేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. నిందితుడిని అనీశ్ మాల్దార్గా గుర్తించారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.
Maharashtra crime news:

ఠాణెలోని ముంబ్రా ప్రాంతంలో నిందితుడు నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకునే అనీశ్.. తన భార్యతో తరచుగా గొడవపడేవాడు. ఓ విషయమై శుక్రవారం రాత్రి వీరి మధ్య వాదన తీవ్రమైంది. దీంతో అనీశ్ కోపంలో తన కుమార్తెను బయటకు తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేశాడని ముంబ్రా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దాదహరి చౌరే తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన భార్య.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిందని చెప్పారు.
బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:బిడ్డను ఆడిస్తున్న తల్లికి షాక్.. పట్టపగలే దొంగలు వచ్చి బెదిరించి...