తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి ఖర్చులు భరించలేక.. కుమారుడ్ని చంపిన తండ్రి

Father Killed Sick Son: కుమారునికి ఓ అరుదైన వ్యాధి సోకింది. చికిత్స కోసం స్తోమతకు మించి ఖర్చుచేశాడు ఆ తండ్రి. జబ్బు ఇంకా నయం కాలేదు. వైద్యులు పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లమన్నారు. చికిత్సకు డబ్బులులేక కుమారున్ని గొంతుపిసికి హత్యచేశాడు తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

Father killed his son in up
యూపీలో కుమారున్ని చంపిన తండ్రి

By

Published : Feb 17, 2022, 10:27 AM IST

Father Killed Sick Son: ఉత్తరాఖండ్​​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి ఖర్చులు భరించలేక సొంత బిడ్డనే గొంతుపిసికి హత్య చేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రాపుర్​లో జరిగింది.

మహమ్మద్​ తారిక్ స్థానికంగా ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షాబన్ రజా అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల రజా.. హీమోఫీలియా అనే జబ్బుతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం తారిక్ స్తోమతకు మించి ఖర్చుచేశాడు. ఈ క్రమంలో అప్పులు కూడా చేశాడు. ఇంకా కుమారుని జబ్బు నయం కాలేదు. స్థానిక వైద్యులు దిల్లీలో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కానీ ఆర్థికంగా చితికిపోయిన తారిక్ ఇక భరించలేననుకుని.. కుమారున్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బహేఢీ జిల్లా, డాకియాలో ఓ కాలువవైపు కుమారునితో కలిసి వెళ్లాడు. చిన్నారిని అక్కడే గొంతుపిసికి పొదల్లో పడేశాడు. ఎప్పటిలాగే ఇంటికి వచ్చేశాడు.

సాయంత్రానికి కుమారుడు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సీసీటీవీ ఆధారాలతో తారిక్​ను ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:పెళ్లి వేడుకలో ఘోరం... బావిలో పడి 13 మంది మహిళలు మృతి

ABOUT THE AUTHOR

...view details