తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్​ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి - men froud women in up

కర్ణాటకలో ఓ తండ్రి సొంత కూతురినే హత్య చేశాడు. వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందనే కారణంతో 14 ఏళ్ల బాలికను తుంగభద్ర కాలువలో తోసేసి చంపాడు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్​లోని బాగ్​పత్ ​జిల్లాలో పరువు హత్య జరిగింది. బాలికపై తాత అఘాయిత్యం చేసిన ఘటన దిల్లీలో జరిగింది.

Father killed his minor daughter
మైనర్​ కూతురిని చంపిన తండ్రి

By

Published : Nov 9, 2022, 3:45 PM IST

Updated : Nov 9, 2022, 8:07 PM IST

వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో తన 14 ఏళ్ల కూతురిని చంపాడు ఓ తండ్రి. మానుకోమని ఎన్నిసార్లు చెప్పిన వినలేదు. దీంతో ఆమెను తుంగభద్ర కాలువలో తోసేసి చంపాడు. అక్టోబర్​ 31న ఈ ఘటన జరిగినప్పటికి తాజాగా వెలుగులోకి వచ్చింది.

అసలు జరిగిందిదీ...
కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓంకార్​ గౌడ కూతురు, కొడితిని టౌన్​కు చెందిన యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయం ఓంకార్​ గౌడకు తెలిసింది. దీంతో ఓంకార్​ గౌడ కూతురిని ఆ యువకుడితో మాట్లాడవద్దని చాలా సార్లు మందలించాడు. అయినా తండ్రి మాటలను ఆమె వినలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఓంకార్​ కూతురిని చంపాలని నిశ్చయించుకున్నాడు.

అక్టోబర్​ 31న మధ్యాహ్నం ఓంకార్​ తన కూతురిని సినిమా చూపిస్తానని చెప్పి బైక్​పై బయటకు తీసుకెళ్లాడు. సినిమా అప్పటికే మొదలయ్యింది. దీంతో ఆమెను హోటల్​కి తీసుకెళ్లి భోజనం చేయించాడు. అనంతరం బసవేశ్వర గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తరువాత జ్యువెలరీ స్టోర్​లో ఓ రింగ్​ సైతం కొనిచ్చాడు. చివరగా సాయంత్రం తుంగభద్ర కాలువ దగ్గరకు చేరుకున్నారు. అనంతరం ఆమెను కాలువలో తోసేసి చంపాడు.

ఆ తరువాత స్నేహితుడు భీమప్ప ఇంటికెళ్లాడు ఓంకార్​. అతన్ని కలిసి అనంతరం రైలులో తిరుపతికి వెళ్లాడు. దర్శనం చేసుకొని వస్తుండగా తిరుగు ప్రయాణంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో ఓంకార్​ నేరం ఒప్పుకొని ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 'తన కూతురి ఖాతాలో ఓంకార్ 20 లక్షలు జమా చేశాడు. హత్యకు ముందు స్నేహితుడు భీమప్ప సాయంతో వాటిని బదిలీ చేశాడు. అతన్ని సైతం అరెస్ట్​ చేశాం. నవంబర్​ 1న ఓంకార్​ భార్య తన భర్త, కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తమ విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది' అని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహం కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.

యూపీలో పరువు హత్య
ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్ ​జిల్లాలోని షామ్లీలో పరువు హత్య జరిగింది. బుధవారం ఉదయం జిల్లా సరిహద్దులోని లంబ్ గ్రామం అడవిలో ఇద్దరి మృతదేహాలను గర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిని ఆసరా గ్రామానికి చెందిన మహిళ అదే గ్రామానికి చెందిన ఆరిఫ్​గా పోలీసులు గుర్తించారు.

గత 8, 9 సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెకు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సైతం ఆరిఫ్​, ఆ మహిళకు మధ్య సంబధం కొనసాగింది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరూ పరారయ్యారు అనంతరం ఇలా శవాలుగా అడవిలో కనిపించారు. "మృతదేహాలను పోస్ట్​మార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించాం. మహిళ సోదరుడే మరికొంత మందితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతన్ని అరెస్ట్​ చేసి మిగతా వారి కోసం వెతుకుతున్నాం" అని పోలీసులు తెలిపారు.

బాలికపై తాత అఘాయిత్యం:
దిల్లీలోని బోల్​స్వా పోలీసు స్టేషన్ పరిధిలో అవమానకర ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. వరుసకు బాలికకు తాత అయ్యే అతడు తన స్నేహితుని సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి విషయం చెప్పింది బాధితురాలు. ఘటనపై మొదటగా మహిళా కమిషన్​ను ఆశ్రయించిన బాధితురాలు తల్లి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించని కారణంగా బాధితురాలు కుటుంబ సభ్యులు, సామాజిర కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితున్ని పట్టుకోనున్నట్లు తెలిపారు.

పెళ్లి పేరుతో మహిళకు టోకరా
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.30 లక్షలు కాజేసాడు ఓ వ్యక్తి. యూపీ గాజియాబాద్​ జిల్లా ఖోదా గ్రామానికి చెందిన రాహుల్​ చతుర్వేది బాధిత మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్​లో పరిచయం అయ్యాడు. వారి పరిచయం శారీరక సంబంధం వరకు వెళ్లింది. మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న రాహుల్​ తన సోదరికి క్యాన్యర్ అని చెప్పి బాధితురాలు నుంచి రూ.30 లక్షలను తీసుకున్నాడు. అనంతరం కొన్ని రోజులకు ఫోన్ స్విచ్​ఆఫ్​ చేసుకున్నాడు. మోసాన్ని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్​ను పట్టుకున్నారు. అతని నుంచి డబ్బుతో సహా కారు. నగలు, ఖరీదైన బట్టలు మరిన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. "రాహుల్ మ్యాట్రిమోనియల్ సైట్​లో ఫేక్​ ఐడీతో అమాయక మహిళలను లక్షంగా చేసుకొని మోసం చేస్తాడు. గతంలోను ఇలాంటి పనులు చాలా చేశాడు. 3 సంవత్సరాలుగా నిందితుడు బబ్లీ శుక్ల అనే మహిళతో ఉంటున్నాడు. ఇద్దరు కలిసి మహిళలకు టోకరా వేసి విలాసమంతమైన జీవనం గడుపుతున్నారు. ఇద్దరినీ అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశాం" అని ఏడీసీపీ అశుతోష్ ద్వివేది తెలిపారు.

ఉత్తరప్రదేశ్​లో ఎదురుకాల్పులు
యూపీ ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు ఫిరోజ్ అహ్మద్ అనే దుండగుడికి మధ్య ఎదురుకాల్పలు జరిగాయి. కాల్పుల్లో దుండగుడికి బుల్లెట్​ గాయమైంది.

ఏం జరిగిందంటే..
అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో దుండగుడు స్కూటీపై వస్తున్నాడు. చెకింగ్ కోసం ఆగాలని అతడికి పోలీసులు సిగ్నల్ ఇచ్చారు. వారిని చూసి దుండగుడు పరిగెత్తాడు. దీంతో అతన్ని వెంబడించగా పోలీసులపై నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసులు సైతం దుండగుడిపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో దుండగుడు.. కాలికి బుల్లెట్ తగిలి కిందపడ్డాడు. నిందితునిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాని, గత నెలలో బిహార్‌కు చెందిన సూరజ్​ అనే యువకుడిని ఫిరోజ్ దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Last Updated : Nov 9, 2022, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details