తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Father Killed Daughter in Hyderabad : రానంటూనే వెళ్లి.. నాన్న చేతిలో బలి.. భార్యపై కోపంతో కూతురిని చంపిన తండ్రి

Father Killed Daughter In Hyderabad : భార్యకు ఆనందాన్ని దూరం చేద్దామని.. పేగు బంధాన్నే తెంచుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అభంశుభం తెలియని చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా ముగించి.. చివరకు కటకటాల పాలయ్యాడు. శవాన్ని మాయం చేద్దామనుకుని.. విధి ఆడిన వింత ఆటలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని చంద్రానగర్​లో జరిగింది.

Father Killed Daughter In Chandanagar
Father Killed Daughter In Hyderabad

By

Published : Aug 20, 2023, 11:06 AM IST

Father Killed Daughter in Hyderabad : రానంటూనే వెళ్లి.. నాన్న చేతిలో బలి.. భార్యపై కోపంతో కూతురిని చంపిన తండ్రి

Father Killed Daughter In Hyderabad : వేలు పట్టుకుని నడక నేర్పాల్సిన నాన్నే.. నరరూప రాక్షసుడయ్యాడు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కుమార్తెను కనికరం లేకుండా కడతేర్చాడు. అభంశుభం తెలియని చిన్నారిని చిదిమేయడం కాకుండా.. మృతదేహాన్ని మాయం(Hyderabad Crime News) చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. మానవత్వాన్ని మంటగలుపుతూ తండ్రి అనే బంధానికే కళంకం తెచ్చిన ఆ క్రూరుడు.. చివరకు విధి ఆడిన వింత ఆటలో అడ్డంగా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది.

హైదరాబాద్‌ బీహెచ్​ఈఎల్​(BHEL) ప్రాంతంలో నివాసం ఉండే హిమబిందు, చంద్రశేఖర్‌కు 2011లో వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కూమార్తె మోక్షజ ఉంది. దంపతులిద్దరూ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది క్రితం చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోగా.. భార్యతో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు. కొలువు పోయిందని చిన్నచూపు చూస్తున్నావంటూ హిమబిందును హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేక హిమబిందు కుమార్తె మోక్షజను తీసుకుని.. పుట్టింటికి వెళ్లిపోయింది.

Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్‌ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం

Father Killed Daughter In Chandanagar : చందానగర్​లో ఒంటరిగా ఉంటున్న చంద్రశేఖర్.. కుమార్తె చదివే పాఠశాల వద్దకు అప్పుడప్పుడు వెళ్లి కలుస్తూ ఉండేవాడు. ఉద్యోగం లేకపోవటంతో ఖర్చుల కోసం పలుచోట్ల అప్పులు సైతం చేశాడు. తాను ఇబ్బందుల్లో ఉంటే భార్య మాత్రం పుట్టింట్లో సంతోషంగా ఉందని రగిలిపోయిన చంద్రశేఖర్‌.. ఆమెపై ఈర్ష్య, ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే హిమబిందు జీవితాంతం బాధపడేలా చేయాలని పథకం రచించాడు.

"ఇతనికి హిమబిందు అనే మహిళతో 2011లో పెళ్లి జరిగింది. వీళ్లు బీహెచ్​ఈఎల్​లో నివసిస్తున్నారు. నాలుగు నెలల నుంచి చంద్రశేఖర్​కు జాబ్​ లేదు. అప్పటి నుంచి భార్యతో విభేదం వచ్చి చందానగర్​లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. భార్యను హింసించాలనే ఉద్దేశంతో ఒక పథకం రచించాడు. తన మీద కోపంతో సొంత బిడ్డను చంపేశాడు."- భీంరెడ్డి, వనస్థలిపురం ఏసీపీ

Chandanagar Murder Case Update :బీహెచ్​ఈఎల్​లోని జ్యోతి విద్యాలయలో నాల్గో తరగతి చదువుతున్న కుమార్తె మోక్షజ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లిన చంద్రశేఖర్‌.. తనతో పంపించాలని ప్రిన్సిపల్‌ను కోరాడు. బిడ్డ వద్దకు తరచుగా వస్తుండటంతో చిన్నారిని పంపించేందుకు ప్రిన్సిపల్‌ అంగీకరించగా.. తరగతి గదిలో ఉన్న మోక్షజ తండ్రి వద్దకు వెళ్లింది. బయటికి వెళ్దామని చంద్రశేఖర్‌ కుమార్తెతో చెప్పగా.. అందుకు అన్యమనస్కంగానే అంగీకరించింది. 3 గంటల 40 నిమిషాల ప్రాంతంలో పాపను స్కూల్‌ నుంచి తీసుకెళ్లిన చంద్రశేఖర్‌.. 4 గంటల సమయంలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు.

Shamshabad Woman Murder Case Update : శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కంట్లో కారం కొట్టి చీర కొంగుతో ఉరి

Chandanagar Murder Case News :అప్పటికే వెంట తెచ్చుకున్న పేపర్లు కత్తిరించే చాకుతో మోక్షజ గొంతుకోశాడు. ఏమైందో అర్థం అయ్యేలోపే మోక్షజ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతదేహాన్ని కారు వెనక సీటులో పెట్టుకొని శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు చంద్రశేఖర్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై తిరిగాడు. శవాన్ని పడేసేందుకు స్థలం కోసం వెతుకుతుండే క్రమంలో.. రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద చంద్రశేఖర్‌ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనం ముందుకు కదలకపోవటంతో అక్కడే నిలిపివేయగా.. స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.

కారులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకొని విచారించగా దారుణం వెలుగులోకి వచ్చింది. మోక్షజ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్ష జరిపి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా ఇంటికి రావటంతో ఆమె తల్లి కన్నీరుమున్నీరైంది.

Woman Dies of Heart Stroke Warangal : బిడ్డకు పాలిచ్చి.. నిద్రలోనే గుండెపోటుతో తల్లి మృతి

Hyderabad Rowdy Sheeter Muder Case Update : అందమైన అబ్బాయిని ఎర వేసి.. రౌడీ షీటర్​ హత్య..!

ABOUT THE AUTHOR

...view details