తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉరికి వేలాడిన తండ్రి.. విగతజీవిగా కుమార్తె.. ఏం జరిగింది? - ఒడిశాలో హత్య

Father killed daughter: దిల్లీలోని హోలంబి కలా ప్రాంతంలో తండ్రీకూతుళ్లు అనుమానాస్పద రీతిలో మృతి చెందటం కలకలం సృష్టించింది. ఇంట్లోనే తండ్రి ఉరికి వేలాడగా.. కుమార్తె మంచంపై విగతజీవిగా పడి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒడిశాలో జరిగిన మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు దుండగులు.

father-killed-daughter
తండ్రీకూతుళ్ల మృతి

By

Published : Mar 23, 2022, 8:12 PM IST

Father killed daughter: తండ్రీకూతుళ్లు ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో విగతజీవులుగా కనిపించటం దిల్లీ, నరేలా ఇండస్ట్రీయల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హోలంబి కలా ప్రాంతంలో కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు తలుపులు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా కుమార్తె మంచంపై పడి ఉండగా.. తండ్రి సురేశ్​ ఉరికి వేలాడుతూ కనిపించాడు. 10 ఏళ్ల బాలిక చాలా రోజులుగా మానసికంగా, భౌతికంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెతోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు తండ్రి. ఈ కారణంగానే ముందు కూతురిని హత్య చేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు తెలిపారు. తల్లి స్థానికంగా ఉండే ఓ పరిశ్రమలోకి పనికి వెళ్లిన క్రమంలో ఈ ఘోరం జరిగిందని వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను బాబు జగ్జీవన్​ రామ్​ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రీకూతుళ్ల మరణానికి గల కారణాలపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పోస్ట్​మార్టం తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.

తండ్రి సురేశ్​
సురేశ్​ కుమార్తె

ఒకే కుటుంబంలో నలుగురి హత్య: ఒడిశా, బెర్హాంపుర్​ జిల్లాలోని పిట్టల్​ గ్రామంలో మంగళవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా హత్యచేశారు దుండగులు. హింజిలికట్​ పోలీసులతో పాటు మరో నాలుగు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లాలోని నరేంద్ర చౌక్​ వద్ద ఓ ఫాస్ట్​ఫుడ్​ దుకాణం ముందు ఘర్షణ జరిగింది. ఓ దంపతులు రోడ్డు ప్రమాదానికి గురికాగా వారికి సాయం చేస్తున్న కొంత మంది యువకులపై మరో గ్రూప్​ సభ్యులు కామెంట్​ చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హింజిలికుట్​ మెడికల్​ సెంటర్​కు తరలించారు. అక్కడి నుంచి ఎంకేసీజీ మెడకల్​ సెంటర్​కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతులు రాజా స్వైన్​, శాంభు స్వైన్​, సంజయ్​ స్వైన్​, వారి బంధువు చందన్​గా గుర్తించారు.

ఇదీ చూడండి:ముగ్గురు భార్యల బంగార్రాజు కేసులో ట్విస్ట్​.. రెండో ఆమెనే స్కెచ్ వేసి...

ABOUT THE AUTHOR

...view details