Father Killed Baby Daughter In Maharashtra :మహారాష్ట్ర.. జల్గావ్ జిల్లాలో మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించిందని ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల నవజాత శిశువు నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పహూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్నేర్ మండలం.. హరినగర్ తండాలో గోకుల్ జాదవ్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. అయితే మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించింది. అయితే మూడోకాన్పులోనూ కూడా ఆడపిల్ల పుట్టిందని ఆగ్రహానికి గురయ్యాడు. ఎనిమిది రోజుల చిన్నారి నోట్లో తంబాకు కుక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశాడు. అయితే, ఈ విషయాన్ని గోకుల్ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. జననాన్ని నమోదు చేసుకునేందుకు ఆశా వర్కర్ గోకుల్ ఇంటికి వెళ్లగ.. అసలు విషయం బయటపడింది. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ ఎమ్ రాజ్‌కుమార్ తెలిపారు.
కుమారుడు, మనవడిని చంపిన వ్యక్తి..
కుమారుడి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మనవడు మృతి చెందారు. అనంతరం విషం తాగి నిందితుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది.