తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.80వేలకు కోడలిని అమ్మేసిన మామ!

ఉత్తర్​ప్రదేశ్​లోని బారబంకీ జిల్లాలో ఓ వ్యక్తి రూ.80 వేలకు కోడలిని గుజరాత్​కు చెందిన పలువురికి అమ్మేశాడు. భర్త సమాచారం మేరకు పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిని వారి చెర నుంచి రక్షించారు. ప్రధాన నిందితుడు చంద్రరామ్​ ఇప్పటివరకు 300 మంది మహిళలను వివిధ వ్యక్తులకు అమ్మినట్లు సమాచారం. ఓ హత్య కేసులో కూడా చంద్రరామ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

బారబంకీ నేర వార్తలు, father in law sold daughter in law
రూ.80వేలకు కోడలినే అమ్మేసిన మామ!

By

Published : Jun 7, 2021, 12:36 PM IST

Updated : Jun 7, 2021, 2:11 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బారబంకీ జిల్లా మల్లాపుర్​ గ్రామంలో శనివారం అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కోడలిని అమ్మేశాడు. ఇందుకోసం గుజరాత్​కు చెందిన పలువురితో రూ.80వేలకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వే స్టేషన్​లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించారు.

అరెస్టు చేసిన 8 మంది నిందితులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, బాధితురాలి మామగారైన చంద్రరామ్​ సహా మరో నిందితుడు రాము గౌతమ్​ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రూ.80వేలకు కోడలినే అమ్మేసిన మామ!

ఇదీ జరిగింది..

నిందితుడు చంద్రరామ్​ కుమారుడు ప్రిన్స్​ వర్మకు 2019లో బాధితురాలితో బారబంకీలో వివాహం జరిగింది. ప్రిన్స్​ వర్మ.. భార్యతో కలిసి గాజియాబాద్​లో నివసిస్తున్నాడు.

అయితే మల్లాపుర్​కే చెందిన రాము గౌతమ్​ అనే వ్యక్తి ఇటీవల అహ్మదాబాద్​ నుంచి గ్రామానికి వచ్చాడు. అహ్మదాబాద్​లో తనకు సాహిల్​ పంచా అనే వ్యక్తి పరిచయమయ్యాడని.. అతను వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రరామ్​కు చెప్పాడు. ఎంత ఖర్చు అయినా చేసేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని చంద్రరామ్​కు స్పష్టం చేశాడు. దీంతో డబ్బు కోసం కోడలిని అమ్మేందుకు నిందితుడు సిద్ధమయ్యాడు.

పథకం ప్రకారం..

తనకు అనారోగ్యంగా ఉందని.. సాయం కోసం కోడలిని పంపించమని కుమారిడిని కోరాడు చంద్రరామ్​. దీనికి సరే అన్న ప్రిన్స్​ వర్మా జూన్​ 4న భార్యను గ్రామానికి పంపించాడు. మరోవైపు పథకం ప్రకారం రాము గౌతమ్ అప్పటికే లఖ్​నవూ చేరిన సాహిల్​ పంచా, అతని కుటుంబసభ్యులను గ్రామానికి చేర్చాడు. చంద్రరామ్​ వారి నుంచి రూ.80వేలలో కొంత నగదు రూపంలో తీసుకుని, మిగతాది కుమారుడి ఖాతాలోకి బదిలీ చేయించాడు.

తండ్రి చర్య గురించి తెలుసుకున్న ప్రిన్స్​ వర్మా జూన్​ 5న గ్రామానికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు.

ఘరానా మామ..

వస్తువులను కొనుగోలు చేసి అమ్మినట్లు ప్రధాన నిందితుడు చంద్రరామ్​ మహిళలతో వ్యాపారం చేస్తాడు. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ వ్యక్తులకు అమ్మినట్లు సమాచారం. బిహార్, గోరఖ్​పుర్​, దేవరియా, ఇమారియా గంజ్​ ప్రాంతాల నుంచి మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి అమ్ముతాడు. క్రయ విక్రయాలకు 8 నుంచి 10 వేల చొప్పున కమీషన్ చంద్రరామ్​ అందుకుంటాడు. వీరిని వివాహం చేసుకోవాలనుకున్న వారి నుంచి 40-50 వేలు వసూలు చేస్తాడు.

ఓ హత్యకేసులో కూడా చంద్రరామ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

ఇవీ చూడండి :Rape: 65ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం!

వజ్రాలు చోరీ చేసి.. ఔషధాల్లో ప్యాక్​ చేసి..

Last Updated : Jun 7, 2021, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details