Father Killed Daughter: మహారాష్ట్ర నాందేడ్‌లో విషాదకర ఘటన జరిగింది. పెళ్లికి డబ్బులు లేవనే కారణంతో సొంత కూతురినే హత్య చేశాడు ఓ తండ్రి. కూతురి వివాహం కోసం ఇంట్లో గొడవ జరగడం వల్ల బాలాజీ అనే వ్యక్తి తన కుమార్తె సింధును కర్రతో కొట్టి చంపాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది: నాందేడ్ ముఖేద్లోని జామ్ఖేడ్ గ్రామానికి చెందిన బాలాజీ విశ్వంభర్ దేవకటేకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల బాలాజీ కుమార్తె సింధుకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అతడి వద్ద.. కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. దీంతో పెళ్లికి డబ్బులు ఎక్కడ నుంచి తేవాలంటూ మనస్తాపానికి గురైన బాలాజీ.. కూతురిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. అడ్డుకోబోయిన భార్యను సైతం కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ యువతి అక్కడిక్కడే మరణించింది.