చికిత్స అందక ఓ వృద్ధుడు ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒడిలోనే తుది శ్వాస విడిచిన తండ్రిని చూసి కుమారుడు బోరున విలపించాడు. తండ్రికి వైద్యులు చికిత్స అందిస్తారని ఆస్పత్రి ముందు పడిగాపులు పడిన ఆ కుమారుడు సహా అతని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాధితుడు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రతలామ్ జిల్లా జావరా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరిగింది.
ఇంతకీ జరిగింది ఏంటంటే..
హరియఖేడా గ్రామానికి చెందిన ఓంకార్ లాల్ పటీదార్ (70) శనివారం శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. తండ్రి పరిస్థితిని గ్రహించిన అతని కుమారుడు.. బంధువులు సాయంతో కారులో జావరా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కానీ వైద్యుల కోసం నిరీక్షించినా ఫలితం లేకపోయింది. బాధితుడు ఓంకార్ లాల్‌ను అతని కుమారుడు తన ఒడిలో పడుకోపెట్టుకుని కారులోనే కూర్చున్నాడు. గంటన్నర తర్వాత పరిస్థితి విషమించి ఓంకార్‌లాల్ తన కుమారుడి ఒడిలోనే తుది శ్వాస విడిచాడు. తండ్రి మరణంతో కుమారుడి రోదనకు అంతులేకుండా పోయింది.
నిర్లక్ష్యమే కారణం..